AP CM YS Jagan : ఏఐటీటీ ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందనలు..ఒక్కోక్క విద్యార్ధికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏఐటీటీ 2020 (సీటీఎస్)లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ సాధించిన ఏపీకి చెందిన 5 గురు విద్యార్ధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
ఒక్కోక్క విద్యార్ధికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
- డి.మణికంఠ, మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్
- మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్ ఇండియా ఐదో ర్యాంక్
- ఎన్.కుమారి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆల్ ఇండియా ఆరో ర్యాంక్
- ఎం.బాల పవన్ రాజు, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంక్
- ఎం.రోషణ్, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ, ఆల్ ఇండియా తొమ్మిదో ర్యాంక్
విద్యార్ధులతో పాటు కౌశలాచార్య అవార్డు 2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ వై.రజిత ప్రియను కూడా సీఎం జగన్ అభినందించారు. ఆమెకు కూడా రూ. 5 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. విద్యార్ధులకు మెమెంటోలతో పాటు సర్టిఫికెట్‌లు, ట్యాబ్‌లను అందజేశారు.
Published date : 29 Oct 2021 04:53PM