Skip to main content

TS TET 2022 Results : తెలంగాణ టెట్ ఫ‌లితాలు ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) జూన్ 12వ తేదీన ప్ర‌శాంతంగా ముగిసింది.
TS TET Results 2022
TS TET Results 2022

ఈ ప‌రీక్ష‌కు 90 శాతం మంది హాజ‌రైన‌ట్టు క‌న్వీన‌ర్ రాధారెడ్డి తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను జూన్ 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు క‌న్వీన‌ర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో టెట్ పేపర్‌–1 & 2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1కు 3,51,468 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. 3,18,506 (90.62శాతం) మంది హాజ‌ర‌య్యారు. అలాగే పేపర్‌–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకోక‌.. 251,070(90.35శాతం) మంది హాజ‌ర‌య్యారు. టెట్‌ పరీక్ష పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జ‌రిగింది. అలాగే పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది. తెలంగాణ టెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.


➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)

TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)

ఈసారి పేపర్‌–2కి
వాస్తవానికి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసిన అభ్యర్థులు టెట్‌ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్‌–2 రాసే వారు కూడా పేపర్‌–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్‌–1కు దరఖాస్తులు భారీగా వచ్చాయి.

Published date : 13 Jun 2022 03:33PM

Photo Stories