Skip to main content

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

సాక్షి, హైదరాబాద్‌: టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది.
TET Eligibility Criteria
TET Eligibility Criteria

గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్‌సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. 

టెట్ మోడ‌ల్‌పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

ఆన్‌లైన్‌ ద్వారా..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ను జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం మార్చి 24వ తేదీన‌ (గురువారం) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను మార్చి 25వ తేదీన ‘ http://tstet.cgg.gov.in/ ’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

ప‌రీక్ష విధానం : 
టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్‌–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. 

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 25 Mar 2022 01:22PM

Photo Stories