Skip to main content

Sabitha Indra Reddy: టెట్‌ వాయిదా వేయ‌డం కుద‌ర‌దు .. ఎందుకంటే..?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: టెట్‌ వాయిదా వేయ‌డం కుద‌ర‌దని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Sabitha Indra Reddy, TS Education Minister
Sabitha Indra Reddy, TS Education Minister

అన్ని పోటీ పరీక్షలను పరిశీలించాకే టెట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. దాదాపు 3.5 లక్షల మంది టెట్ పరీక్షలు రాయబోతున్నార‌న్నారు.  జూన్‌ 12న తెలంగాణలో టెట్‌ పరీక్ష జరగనున్న విష‌యం తెల్సిందే.

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్ష ఉంది క‌నుక టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఒక‌ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్.. ఈ అభ్యర్థనను పరిశీలించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. కేటీఆర్‌ ట్వీట్‌‌కు స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి పై విధంగా బదులిచ్చారు. అంతకు ముందుగానే టెట్ కన్వీనర్ రాధారెడ్డి సైతం టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. పరీక్ష షెడ్యూల్‌ను మార్చిలోనే ప్రకటించామని తెలిపారు. జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

టీఎస్ టెట్‌కు మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయి, ఇందులో పేపర్‌–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్‌–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉన్నాయి.

టెట్‌–పేపర్‌–1 ఇలా..

రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది. అవి..

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి  30 30
2 లాంగ్వేజ్‌1 30 30
3 లాంగ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌) 30 30
4 గణితం 30 30
5 ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 30
మొత్తం    150 150

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టెట్‌ పేపర్‌–2 స్వరూపం :

ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్‌ పేపర్‌–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్‌ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 30
2 లాంగ్వేజ్‌1 30 30
3 లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌) 30 30
4 సంబంధిత సబ్జెక్ట్‌  60 60
మొత్తం   150 150

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

Published date : 21 May 2022 05:01PM

Photo Stories