Skip to main content

TSLPRB: ఎస్సై తుది రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ‘కీ’ కోసం క్లిక్‌ చెయండి

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసెస్‌ కొలువుల భర్తీలో భాగంగా ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో ఎస్సై, తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ఏప్రిల్‌ 15 ఉదయం నుంచి అందుబాటులో ఉండనుంది.
TSLPRB
ఎస్సై తుది రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ‘కీ’ కోసం క్లిక్‌ చెయండి

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. సివిల్‌ ఎస్సై, కమ్యూనికేషన్‌ ఎస్సై, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు తుది రాత పరీక్ష పూర్తయిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ప్రిలిమినరీ కీ లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్‌ 17సాయంత్రం 5 గంటల తెలియజేయవచ్చని శ్రీనివాసరావు తెలిపారు.

☛ TS SI Final Exam Telugu Question Paper With Preliminary Key 2023

☛ TS SI Final Exam Urdu Question Paper With Preliminary Key 2023

☛ TS SI Final Exam English Question Paper With Preliminary Key 2023

☛ TS SI Final Exam Question Paper With Key 2023: Arithmetic and Reasoning Exam QP With Key 2023

www.tslprb.in వెబ్‌సైట్‌లో సూచించిన టెంప్లేట్ల విధానంలోనే ప్రతి ప్రశ్నకు వేర్వేరుగా అభ్యంతరాలు అప్‌లోడ్‌ చేయా లని సూచించారు. ఇందుకు సంబంధించిన సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు, మెటీరియల్‌ను పీడీఎఫ్‌ లేదా జేపీఈజీ విధానంలో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. రాతపూర్వకంగా పంపే అభ్యంతరాలను స్వీకరించమని పేర్కొన్నారు.

Published date : 17 Apr 2023 01:29PM

Photo Stories