Skip to main content

Prof Laxmi Kant Rathod: ఉద్యోగాలు సాధించడం గర్వకారణం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూని వర్సిటీ విద్యార్థులు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించడం యూనివర్సిటీకే గర్వకారణమని వీసీ లక్ష్మీ కాంత్‌రాథోడ్‌ పేర్కొన్నారు.
Prof Laxmi Kant Rathod
ఉద్యోగాలు సాధించడం గర్వకారణం

పీయూలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అక్టోబ‌ర్ 6న‌ ఆయన అభినందించారు. యూనివర్సిటీలోని అన్ని సౌకర్యాల ను వినియోగించుకుని అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారన్నారు. ఇబ్బందులను గుర్తించి స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చామని, పోలీస్‌ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా గ్రౌండ్‌ ప్రాక్టీస్‌ కూడా చేయించామన్నారు.

చదవండి: Suman and Soumya: సివిల్‌ కానిస్టేబుళ్లుగా భార్యాభర్తల ఎంపిక

ఉద్యోగాలు సాధించిన వారు ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్‌లో ఎస్‌ఐ, గ్రూప్స్‌పై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగాల్లో చేరాక విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, సాయం కోసం వచ్చే వారికి తమవంతు సహకారం అందించాల న్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ భూమ య్య, శ్రీధర్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Published date : 07 Oct 2023 03:11PM

Photo Stories