Skip to main content

TS 10th Class Evaluation & Results: టెన్త్‌ మూల్యాంకనానికి సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు

TS 10th Class Evaluation & Results: టెన్త్‌ మూల్యాంకనానికి సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు
TS 10th Class Evaluation & Results: టెన్త్‌ మూల్యాంకనానికి సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్‌: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 3నుంచి 10వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో మూల్యాంకనం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1,53,753 పేపర్లు మూల్యాంకనానికి రానుండగా.. వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల నుంచి 765 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో మూల్యాంకనం నిర్వహించే అసిస్టెంట్‌ ఎగ్జామినర్లతో పాటు చీఫ్‌ ఎగ్జామినర్‌, స్పెషల్‌ అసిస్టెంట్లను నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు క్యాంపు ఆఫీసర్‌గా, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు, నోడల్‌ అధికారి కురుమయ్య డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. మరో ఏడుగురు అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.

Published date : 01 Apr 2024 01:17PM

Photo Stories