Skip to main content

ఏపీ డీఎస్సీకి 6,08,153 దరఖాస్తులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018కి మొత్తం 6,08,153 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 18 అర్ధరాత్రిలో గడువు ముగియగా మొత్తం 6,26,791 మంది ఫీజు చెల్లించారని వివరించారు. ఈ మేరకు నవంబర్ 19న ప్రకటన విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పోస్టులకు 1,12,197 మంది, ఎస్‌ఏ (లాంగ్వేజెస్)కు 31,807 మంది, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 24,330 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 3,45,115 మంది, పీఈటీ పోస్టులకు 13,840 మంది, మ్యూజిక్ టీచర్ పోస్టులకు 641 మంది, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ పోస్టులకు 1258 మంది, క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు 1722 మంది, ప్రిన్సిపాల్ పోస్టులకు 5832 మంది, పీజీటీ పోస్టులకు 25,775 మంది, టీజీటీ పోస్టులకు 44,723 మంది, స్పెషల్ స్కూల్ పోస్టులకు 913 మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులు నవంబర్ 22 నుంచి 28 వరకు పరీక్ష కేంద్రాల కోసం ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నవంబర్ 22 నుంచి 28 వరకు స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టుల అభ్యర్థులు; 24 నుంచి 30 వరకు టీజీటీ, ప్రిన్సిపాల్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అభ్యర్థులు, డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు ఎస్‌జీటీ పోస్టుల అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. డిసెంబర్ 1 నుంచి స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్), 3 నుంచి స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్), 5 నుంచి పీజీటీ, 9 నుంచి టీజీటీ, ప్రిన్సిపాల్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, లాంగ్వేజ్ పండిట్లు, 17 నుంచి ఎస్‌జీటీలు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Published date : 20 Nov 2018 01:21PM

Photo Stories