Skip to main content

Female Reservation in Government Jobs 2023 :ఇక‌పై ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు.. అలాగే టీచర్ల పోస్టుల్లో కూడా 50%..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇక‌పై ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీలో మహిళలకు ప్ర‌భుత్వం సింహ‌భాగం ఇవ్వ‌నున్న‌ది. అటవీ శాఖ మినహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Madhya Pradesh Government Job Recruitment Notice, Madhya Pradesh Government Job Recruitment Notice,35 percent women reservation news telugu,35% Reservation for Women in Government Jobs
35 percent women reservation news

ఈ మేరకు మధ్యప్రదేశ్‌ సివిల్ సర్వీసెస్‌(స్పెషల్‌ ప్రొవిజన్‌ ఫర్‌ అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌) రూల్స్‌–1997కు సవరణ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇకపై మహిళలకు 35 శాతం కోటా అమలవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పోలీసు శాఖతోపాటు ఇతర ప్రభుత్వ పోస్టుల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు టీచర్ల పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇటీవల ప్రకటించారు.

☛ Womens Reservation Bill History : మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంటే ఏమిటి..? దీనిని ఎప్పుడు.. ఎలా.. అమ‌లు ప‌రిచారంటే..?

అలాగే 'లాడ్లి బెహనా యోజన’ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెలా అందించే రూ.1,250ని రేపే ఖాతాలో వేస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవ్వడానికి కుదరదని ముఖ్యమంత్రి చెప్పారు.

☛ GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవ‌రు..?

Published date : 06 Oct 2023 02:34PM

Photo Stories