Skip to main content

HCL: ఐటీఐ అర్హ‌త‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు... ప‌రీక్ష లేకుండానే నియామ‌కం.. ఇలా అప్లై చేసుకోండి

ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది శుభవార్త‌. ఐటీఐ పూర్తి చేసిన వారికి మధ్యప్రదేశ్‌లోని బాలాఘట్‌కు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలోని మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ కింది ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.
HCL Recruitment 2023
ఐటీఐ అర్హ‌త‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు... ప‌రీక్ష లేకుండానే నియామ‌కం.. ఇలా అప్లై చేసుకోండి

ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎలాంటి రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌కుండా.. కేవ‌లం అక‌డ‌మిక్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి స్టైఫండ్ కూడా అంద‌జేస్తారు. అర్హులైన వారు ఇలా అప్లై చేసుకోండి. 

వివరాలు...

మొత్తం ఖాళీలు: 184

మేట్‌, బ్లాస్టర్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సర్వేయర్‌, మాసన్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

విభాగాలు: మైన్స్‌, డీజిల్‌, గ్యాస్‌, ఎలక్ట్రిక్‌, సివిల్, మెకానికల్‌ తదితరాలు.

hcl

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18-25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 05.08.2023.

Published date : 10 Jul 2023 06:40PM
PDF

Photo Stories