Contract and Outsourcing: ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయాలి
నల్లగొండ టూటౌన్: ఈనెల 25న నల్లగొండలోని టీఎన్‌జీఓస్ భవన్‌లో నిర్వహించే ఉమ్మడి జిల్లా ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయాలని టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్ కోరారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్‌జీఓస్ భవన్‌లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగులకు మంచి జరిగినప్పటికీ.. కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. నూతన పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఇతర సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యో గులకు ప్రతినెలా 5వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి కంచనపల్లి కిరణ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేపూరి నరసింహాచారి, వెల్లంకి మాధవి, జయరావు, వి.భాస్కర్, లక్ష్మయ్య, సత్యనారాయణ, దుర్గ, జాఫర్ పాల్గొన్నారు.