Skip to main content

MCA

ఎంసీఏ పూర్తి చేసి అయిదేళ్ళ నుంచి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు అడ్వరై ్టజ్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నాను. ఏం చేయాలి? దూరవిద్య ద్వారా ఏదైనా కోర్సు చేస్తే ఈ రంగంలోకి ప్రవేశించడం సాధ్యమా?
+
సాఫ్ట్‌వేర్‌ రంగంలో అయిదేళ్ళ అనుభవం చాలా విలువైంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. ఈ కారణంగా అనేక పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు, నియామకాలు నిలిపి వేయడం వంటి పొదుపు చర్యలు చేపడుతున్నాయి. ఇలాంటప్పుడు స్థిరమైన ఉద్యోగం వదలి కొత్త రంగం వైపు అడుగులు వేయడం కంటే, చేస్తున్న పనిలోనే అదనపు అర్హత, అనుభవం సంపాదించే ప్రయత్నం చేయడం మంచిది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమేణా మెరుగుపడే అవకాశాలున్నాయి. కాబట్టి మీ నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేయండి. ఈ సమయంలో అడ్వరై ్టజింగ్‌కు కావాల్సిన అర్హత సంపాదించి, ఆ తర్వాత పరిస్థితి బాగుందనిపిస్తే.. కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశాల్ని పరిశీలించవచ్చు.
ఇటు పరిశ్రమ, అటు వినియోగవర్గాల నుంచి సరైన స్పందన లేకపోతుండటంతో మార్కెట్‌ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. దీని ప్రభావం అడ్వరై ్టజ్‌మెంట్‌ రంగంపై కూడా పడింది. అవసరమైన అర్హతతో పాటు మంచి ప్రతిభాసామర్థ్యాలు కలిగిన వారే ప్రస్తుత పరిస్థితుల్లో రాణించే అవకాశం ఉంది.

అడ్వరై ్టజింగ్‌ కోర్సులు అందించే విద్యాసంస్థలు :
డాక్టర్‌ హరి సింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయ, సాగర్‌, మధ్య ప్రదేశ్‌ - అడ్వరై ్టజింగ్‌ ఒక పేపర్‌గా పీజీ డిప్లొమా ఇన్‌ మార్కెటింగ్‌ కోర్సును అందిస్తోంది.
కాలవ్యవధి : సంవత్సరం.
వెబ్‌సైట్‌ : www.idesagaruniv.nic.in
భారతీయ విద్యాభవన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, బషీర్‌బాగ్‌, కింగ్‌ కోఠి రోడ్‌, హైదరాబాద్‌ - పార్ట్‌టైమ్‌ (ఈవెనింగ్‌) కోర్సుగా పీజీ డిప్లొమా ఇన్‌ ఇన్‌ మార్కెటింగ్‌ అండ్‌ అడ్వరై ్టజింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. కాలవ్యవధి - సంవత్సరం.
దూరవిద్య, రెగ్యులర్‌ విద్య మధ్య తేడా ఏమిటి? దూరవిద్య, రెగ్యులర్‌ విధానంలో ఎంసీఏ ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీల గురించి తెలపండి?
+
దూరవిద్యకు తరగతి గదితో సంబంధం ఉండదు. కోర్సుకు సంబంధించిన సబ్జెక్టుల్లో ముఖ్యాంశాలను నిపుణులతో మెటీరియల్‌ రూపంలో రూపొందించి దూరవిద్య విద్యార్థులకు అందిస్తారు.అలాగే సీడీ, ఆడియో, వీడియో, ఈ-మెరుుల్‌, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి బోధన సాగిస్తారు. నిర్దేశించిన కొన్ని రోజుల్లో మాత్రమే కాంటాక్ట్‌ క్లాసులు ఉంటారుు. ఉద్యోగులు, గ్రామీణులు, చదువుకోవడానికి తరగతికి వెళ్లలేని వారికి ఈ విధానం వల్ల ప్రయోజనమెక్కువ. ఒకవైపు రెగ్యులర్‌ కోర్సు చేస్తూ.. మరోవైపు దూరవిద్య విధానంలో చదవడం వల్ల ఏకకాలంలో రెండు అర్హతలను సాధించే అవకాశం ఉంటుంది. దూరవిద్యకు లభిస్తోన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన అనేక విశ్వవిద్యాలయూలు అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ విధానంలో అనేక కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారుు. దీనికి భిన్నమైంది రెగ్యులర్‌ విధానం. ఉపా ధ్యాయుడు- విద్యార్థి మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇక్కడ విద్యాబోధన సాగుతుంది. విద్యార్థికి వచ్చే సందేహాలు అప్పటికప్పుడే నివృత్తి చేసుకునే వీలు ఈ విధానంలో ఉంటుంది.
రెగ్యులర్‌ విధానంలో ఎంసీఏ ఆఫర్‌ చేస్తోన్న సంస్థలు :
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌-ఇంటర్మీడియెట్‌ స్థారుులో మ్యాథమెటిక్స్‌ చదివి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ప్రవేశ పరీక్ష ఉంటుంది. వివరాల కోసం వెబ్‌సైట్‌ www.uohyd.ernet.in చూడవచ్చు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయూలు, కళాశాలలు రెగ్యులర్‌ విధానంలో ఎంసీఏ కోర్సును ఆఫర్‌ చేస్తున్నారుు.
దూరవిద్యా విధానంలో...
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ, దూరవిద్య విభాగం, తిరుపతి-ఇంటర్మీడియెట్‌ స్థారుులో మ్యాథమెటిక్స్‌ చదివి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ప్రవేశ పరీక్ష ఉంటుంది. వివరాల కోసం వెబ్‌సైట్‌ www.svudde.org చూడవచ్చు.
భారతీయూర్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌- ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ లేదా మ్యాథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌ ఒక ప్రత్యేకాంశంగా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
ఎంసీఏ డిటైన్డ్‌ ఆయ్యాను. కోర్సు పూర్తయిన తర్వాత డిటైన్డ్‌ అభ్యర్థిగా నాకు అవకాశాల్లో తేడా ఉంటుందా. కెరీర్‌లో ఎదగడానికి తగిన సలహా ఇవ్వగలరు?
+
ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఉద్యోగం రావడం అంత సులభం కాదు. స్కిల్స్‌ పరంగా, అకడెమిక్‌ పరంగా అన్ని అర్హతలున్న వారు కూడా తక్కువ జీతాలకు  పనిచేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో మీలాంటి వారికి కొద్దిగా ఇబ్బందనే చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో.. లభించిన ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా స్కిల్స్‌ పెంచుకోవ డానికి దోహదం చేసే షార్ట్‌ టర్మ్‌ కోర్సులు చేయడం మంచిది. అయితే ఎంచుకునే కోర్సులు మీ టెక్నికల్‌ స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసేలా ఉండాలి. అకడెమిక్‌ స్టడీస్‌కు సంబంధించి మార్కెట్లో డిమాండ్‌ ఉన్న అంశమైతే చాలా ఉపయోగం. కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా విస్తత్ర పరిధిలో అధ్యయనం చేయడానికి ప్రయత్నించండి. పార్ట్‌ టైం జాబ్‌ చేస్తూ సర్టిఫికెట్‌ కోర్సులను చేయవచ్చు. తర్వాత విద్యార్హతలను పెంచుకునేలా ఎంటెక్‌, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసే ముందు మీరు ఏ అంశాల్లో మెరుగో వాటి ఆధారంగా రెజ్యూమె ప్రిపేర్‌ చేసుకోండి. ప్రముఖ కంపెనీలనే కాకుండా ఏ సంస్థల్లోనైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండండి. ఆ సమయంలో మీ సహచరుల కంటే తక్కువ హోదాలో, తక్కువ వేతనాలకు పని చేయాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిరుత్సాహం చెందకుండా పద్ధతి ప్రకారం కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను ఆప్‌గ్రేడ్‌ చేసుకుంటే ఉన్నత స్థానానికి ఎదగొచ్చు.
ఐఐటీలో ఎంసీఏ అడ్మిషన్‌ విధానాన్ని తెలపండి?
+
దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లో ఐఐటీ-రూర్కీ మాత్రమే మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ)ని ఆఫర్‌ చేస్తోంది. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జామ్‌) ద్వారా ఇందులో ప్రవేశం కల్పిస్తారు. మ్యాథ్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు జామ్‌కు అర్హులు.
వెబ్‌సైట్‌: www.iitr.ac.in
ఎంసీఏను దూర విద్యా విధానంలో అందిస్తోన్న సంస్థలేవి?
+
మన రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ-డెరైక్టర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, తిరుపతి మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ)ను దూర విద్యావిధానంలో అందిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదవాలి. వివరాలకు: www.svudde.org
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఎంసీఏ)ను దూర విద్యావిధానంలో ఆఫర్‌ చేస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా గ్రాడ్యుయే షన్‌ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలి.
వెబ్‌సైట్‌: www.anucde.com
భారతీయార్‌ యూనివర్సిటీ-స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, కోయంబత్తూరు- మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ)ను దూర విద్యావిధానంలో ఆఫర్‌ చేస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలి. వెబ్‌సైట్‌:  www.bu.ac.in
బీఎస్‌సీ (మ్యాథ్స్‌) 76 శాతం మార్కులతో పూర్తి చేశా. NIT ఆఫర్‌ చేసే ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి? ఎంత ర్యాంకు తెచ్చుకోవాలి?
+
ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌ (60 సీట్లు); ఎన్‌ఐటీ, దుర్గాపూర్‌ (60 సీట్లు); ఎన్‌ఐటీకే, సూరత్‌కల్‌ (60 సీట్లు); ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌ (60 సీట్లు); ఎన్‌ఐటీ-జంషెడ్‌పూర్‌ (60 సీట్లు); ఐటీ, తిరుచిరాపల్లి (60 సీట్లు); ఎన్‌ఐటీ, కాలికట్‌ (30 సీట్లు); ఎన్‌ఐటీ, రాయ్‌పూర్‌ (60 సీట్లు); ఎన్‌ఐటీ, వరంగల్‌ (30)లలోని ఎన్‌.ఐ.టి.ల్లో ఎంసీఏ కోర్సును ఆఫర్‌ చేస్తున్నారు. ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ మ్యాథ్స్‌ ఒక ప్రధా నాంశంగా చదివి కనీసం 60 శాతం మార్కులతో (6.5/10 సీజీపీఏ) గ్రాడ్యుయేషన్‌ (మూడేళ్లు) పూర్తయిన అభ్యర్థులు ఎంసీఏ చేయడానికి అర్హులు. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యరులకు 55 శాతం (6.0/10 సీజీపీఏ) రావాలి. వీటిలో ప్రవేశానికి NIMCET రాయాలి. రెండున్నర గంటల కాలవ్యవధి. 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు మ్యాథమెటిక్స్‌ అంశంలో సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఆల్జీబ్రా, కోఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్‌, వెక్టర్స్‌, ట్రెగ్నామెట్రీ, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌- కంప్యూటర్‌ బేసిక్స్‌, డేటా రిప్రజెంటేషన్‌తో పాటు జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారించాలి. అధిక మార్కులు సంపాదించి 200- 250 ర్యాంకు సాధించుకుంటే మీరు ఆశిస్తున్న కళాశాలలో సీటు లభించగలదు.