TCS Salary Hike: గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. ఇది కదా ఉద్యోగులకు కావాల్సింది!
ఇన్ఫోసిస్ కంపెనీ వేతన పెరుగుదలను వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ మీద 200 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపుతున్నప్పటికీ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Also read: Word of the Day (13.07.2023) - "Calamity" Meaning and Usage in a Sentence
నివేదికల ప్రకారం, కంపెనీలో అత్యుత్తమ పనితీరుని కనపరచిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం జీతాలను పెంచినట్లు తెలిసింది. దీనితో పాటు ప్రమోషన్లను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని టీసీఎస్ సీఎఫ్ఓ సమీర్ సెక్సరియా వెల్లడించారు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల క్షీణత తగ్గి 17.8 శాతానికి చేరినట్లు తెలిసింది. కాగా జూన్ 30 నాటికి కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,15,318 మంది. గత మూడు నెలల్లో ఉద్యోగులు 523 మంది పెరిగారు. కాగా ఈ వర్క్ ఫోర్స్‌లో మహిళలు 35.8 శాతం ఉండటం గమనార్హం.
(ఇదీ చదవండి: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation)
కంపెనీ అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి వారిని గుర్తించి రివార్డులను సైతం అందిస్తోంది. గత కొన్ని రోజుల్లో ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.