EAMCET: 14న ఎంసెట్ నోటిఫికేషన్.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..
ఈ భేటీలో నోటిఫికేషన్ వెలువరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు అంగీకారం కుదిరిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మార్చి 8న మీడియాకు తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు వివరించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్దిష్ట మైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్ లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్ పరిశీలించి.. ఇబ్బంది లేకుండా చూసేందుకే కసరత్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలుండాలి? ఎక్కడ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది? అనే అంశాలను టీసీఎస్ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు.
చదవండి: క్వీక్ రివ్యూ | బిట్ బ్యాంక్ | గైడెన్స్
జూన్ చివరి వారం..
మే నెలలో ఇంటరీ్మడియెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఇదే నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు విద్యార్థులు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వారం ఎంసెట్ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీసీఎస్ కు వివరించినట్లు వారు తెలిపారు. దీంతో పాటే పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోగా ఎంసెట్ ర్యాంకుల వెల్లడికీ కసరత్తు చేయాలని తీర్మానించారు. వాస్తవానికి గతంలో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండేది. కానీ, ఈసారి దానికి అవకాశం లేదని ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్టియర్ పరీక్షల్లో కనీస మార్కులతో ప్రమోట్ చేశారు. కాబట్టి ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇంటర్ పరీక్ష ఫలితాలకు, ఎంసెట్ ర్యాంకుల వెల్లడికి సంబంధం ఉండదు. అందుకే త్వరగా ఫలితాలు వెల్లడించే వీలుంది. అలాగే కౌన్సెలింగ్ తేదీలపై మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఫలితాలు, ఐఐటీ, నీట్ ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్ కౌన్సెలింగ్ను ఖరారు చేయాలనే యోచనలో అధికారులున్నారు.
చదవండి: మోడల్ పేపర్లు | ప్రివియస్ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు
ప్రిపరేషన్ సాగించండిలా..
ఎంసెట్‌లో సత్తా చాటి కోరుకున్న కాలేజీ, బ్రాంచ్‌లో/కోర్సులో ప్రవేశం పొందాలని లక్షలాది మంది ఉవ్విళ్లూరుతుంటారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. టీఎస్ ఎంసెట్–2022 నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతోంది. దీంతో ప్రస్తుతం విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టిపెడుతున్నారు.
టాప్ ర్యాంకే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. ఎంసెట్‌లో విజయానికి హార్డ్‌వర్క్‌తోపాటు సమయ పాలన, ప్రిపరేషన్ వ్యూహాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు ఉపయోగపడేలా నోటిఫికేషన్ సమాచారంతోపాటు సబ్జెక్టుల వారీగా ఫ్యాకల్టీ అందిస్తున్న ప్రిపరేషన్ టిప్స్..
కోర్సులు..
టీఎస్ ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డైరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బండ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీఫార్మసీ, ఫార్మడీ(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
చదవండి: College Predictor 2021 - TS EAMCET | AP EAPCET
పరీక్ష స్వరూపం..
ఎంసెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో మొత్తం 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్..
సబ్జెక్టు ప్రశ్నలు మ్యాథమెటిక్స్ 80 ఫిజిక్స్ 40 కెమిస్ట్రీ 40 మొత్తం 160 అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్.. సబ్జెక్టు ప్రశ్నలు బయాలజీ(బోటనీ+జువాలజీ) 40+40=80 ఫిజిక్స్ 40 కెమిస్ట్రీ 40 మొత్తం 160 ప్రిపరేషన్ టిప్స్.. ప్రిపరేషన్ పరంగా చదవడంతోపాటు ప్రాక్టీసుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పాత ఎంసెట్ ప్రశ్నపత్రాలను సాధించాలి
ప్రతి రోజూ కనీసం 100 ప్రశ్నలను సాధన చేయాలి. ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న తప్పులను విశ్లేషించాలి. కష్టంగా అనిపించే ప్రశ్నలను గుర్తించి... రివిజన్‌లో వాటిపై దృష్టి సారించాలి. సులభంగా ఉన్న ప్రశ్నలను సైతం రివిజన్ చేయాలి. ఆరోగ్యం.. పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు శారీరక, మానసిక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలి. మంచి సమతుల ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరు నుంచి ఏడు గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. ప్రిపరేషన్ పరంగా సానుకూలతను ప్రదర్శించాలి. తద్వారా పరీక్ష పరంగా ఆశించిన ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని అతివిశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని గుర్తించాలి. మాక్ టెస్టులు.. రోజూ మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పరీక్ష పరంగా స్వీయ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. మాక్‌టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్ వ్యూహాలను మార్చుకోవాలి.