TSCHE: ఎంసెట్ విద్యార్హతల్లో మార్పులు?
ఈ దిశగా అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో డిసెంబర్ 1న ఓ కమిటీని నియమించింది. ఏఐసీటీఈ కొన్ని ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందేవారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ విధానానికి బదులుగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి చేసి, కెమిస్ట్రీ స్థానంలో ఏ ఇతర సబ్జెక్టు చదివి ఉన్నా.. ఎంసెట్ పరీక్ష రాసి, ఇంజనీరింగ్‌లో చేరేందుకు అర్హత కల్పించాలని సూచించింది.
చదవండి: ఎంసెట్ హోమ్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
ఉదాహరణకు ఓ విద్యార్థి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కంప్యూటర్స్ చేసి ఉంటే అతనికి ఎంసెట్ రాసే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌లో మొత్తం 14 సబ్జెక్టుల్లో దేన్ని పూర్తి చేసినా ఎంసెట్‌కు అర్హత ఇవ్వాలని పేర్కొంది. మూడో సబ్జెక్టు ఏదైనప్పటికీ.. మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రం తప్పనిసరి చేసింది. కాగా, ఏఐసీటీఈ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో అమలు చేయడం సాధ్యమా? లేదా? అనే విషయంలో కమిటీ అధ్యయనం చేసి, ఉన్నత విద్యామండలికి నివేదిక ఇవ్వనుంది.
చదవండి: EAMCET 2023లో మంచి ర్యాంక్ సాధించడం ఎలా?
మ్యాథ్స్, ఫిజిక్స్‌తో మరేదైనా సబ్జెక్టు 14 సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం రాష్ట్రంలో సాధ్యాసాధ్యాలపై కమిటీ నియామకం .