Skip to main content

Teacher Recruitment Test: నిరుద్యోగులకు తీపి కబురు

నిజామాబాద్‌అర్బన్‌: నిరుద్యోగులకు సర్కారు తీపి కబురు వినిపించింది. జిల్లాలో 309 టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్టీ) ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Sweet talk for the unemployed
నిరుద్యోగులకు తీపి కబురు

దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017లో టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేసిన ప్రభుత్వం మరోమారు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో జిల్లా నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 20 నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనుంది. నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు నెలల సమయమే ఉన్నందున అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కానున్నారు. టీఆర్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నోటిషికేషన్‌తో ఊపిరిపోసినట్లయ్యింది.

చదవండి: DSCలో కొత్త Subject ఇదే.. Scoring subject ఏదంటే! #sakshieducation

తగ్గిన పోస్టులు.. పెరిగిన పోటీ

జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 309 టీఆర్టీ పోస్టులకు ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ 96, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ 183, లాంగ్వేజ్‌ పండిత్‌ 21, పీఈటీలు 9 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని భర్తీ చేయనుంది. కాగా ఇదివరకే టెట్‌ ఉత్తీర్ణులైన వారి సంఖ్యను పరిశీలిస్తే పెద్ద మొత్తంలో పోటీ పెరిగింది.

జిల్లాలో టెట్‌ ఉత్తీర్ణత అభ్యర్థులు పేపర్‌–1లో 4880, పేపర్‌–2లో 5383 మంది ఉన్నారు. ప్రస్తుతం సెప్టెంబ‌ర్ 15న మరోసారి టెట్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే 12వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు సైతం ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 309 పోస్టులకు సుమారు 20వేల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

చదవండి: TS TET 2023 Bitbank: చాప్టర్ల వారీగా Perspectives in Education ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

ఆటంకాలు లేకుండా చేపట్టాలి

ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా టీఆర్టీ నిర్వహించాలి. కొనేళ్లుగా అభ్యర్థులు ఉపాధ్యాయుల పోస్టుల కోసం ఎదురుచూస్తున్నరు. ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలి.
– రమావత్‌ లాల్‌సింగ్‌, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

పోస్టుల సంఖ్య పెంచాలి

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య మరింత పెంచాలి. పోటీకి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున పునరాలోచించాలి. టీఆర్టీ ప్రకటన కోసం నిరుద్యోగులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.
– అనిల్‌, టీఆర్టీ అభ్యర్థి

Published date : 09 Sep 2023 01:18PM

Photo Stories