Skip to main content

Indian Super League: ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై సిటీ!

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టోర్నీలో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రెండోసారి విజేతగా నిలిచింది.
Mumbai City FC down Mohun Bagan, lift ISL title

దాదాపు 62 వేల సామర్థ్యం గల సాల్ట్‌లేక్‌ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మే 4వ తేదీ జరిగిన ఫైనల్లో ముంబై 3–1 గోల్స్‌ తేడాతో మోహన్‌బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. 

ముంబై తరఫున జార్జ్‌ పెరీరా డియాజ్‌ (53వ నిమిషం), బిపిన్‌ సింగ్‌ (81వ నిమిషం), జాకబ్‌ వోజస్‌ (90+7వ నిమిషం)లో గోల్స్‌ కొట్టారు. మోహన్‌బగాన్‌కు పెట్రాటోస్‌ ఒకే ఒక్క గోల్‌ చేశాడు. బిపిన్‌ సింగ్‌కు రెండోసారి ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌లో గోల్‌ చేసే ఘనత సాధించాడు.

Chess Champions: భారతదేశానికి చెందిన చెస్ చిచ్చరపిడుగులు వీరే..

ఫుర్బా లచెన్పా (ముంబై) - గోల్డెన్‌ గ్లవ్‌ అవార్డు
విక్రమ్‌ ప్రతాప్‌ సింగ్‌ (ముంబై) - ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు
దిమిత్రియోస్‌ దియామంతకూస్‌ (కేరళ బ్లాస్టర్స్‌) - గోల్డెన్‌ బూట్‌ అవార్డు
పెట్రాటోస్‌ (మోహన్‌ బగాన్‌) - ప్లేయర్‌ ఆఫ్‌ ద లీగ్‌ అవార్డు

Published date : 06 May 2024 01:13PM

Photo Stories