Child: రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఎంత?
2019లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) సర్వే నిర్వహించి తాజాగా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అక్టోబర్ 28న వెల్లడించాయి. నివేదిక ప్రకారం... ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 30 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 23 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది చనిపోయేవారు. రాష్ట్రంలో మగ శిశు మరణాల రేటు 24, ఆడ శిశువుల మరణాల రేటు 22గా ఉంది. ³ట్టణాల్లో శిశు మరణాల రేటు 18 ఉండగా, పల్లెల్లో 26 మంది మరణిస్తున్నారు.
నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు...
- 1971లో దేశంలో శిశు మరణాల రేటు 129 ఉండేది. 21 పెద్ద రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల రేటు అత్యంత తక్కువగా కేరళలో ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 46 మంది మరణిస్తున్నారు.
- 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాం, నాగాలాండ్‌లో ప్రతి మందికి ముగ్గురు చొప్పున శిశువులు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మేఘాలయలో 33 మంది మరణిస్తున్నారు.
- కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత తక్కువగా అండమాన్ అండ్ నికోబార్‌లో ఏడుగురు మరణిస్తుండగా, అత్యంత ఎక్కువగా డామన్, డయ్యూలో 17 మంది శిశువులు మరణిస్తున్నారు.
చదవండి: సినిమాల రెగ్యులేషన్ చట్టం సవరణ ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రతి వెయ్యికి 23 మంది శిశువులు మరణిస్తున్నారు
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
ఎక్కడ : తెలంగాణ రాష్ట్రం
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్