Pakistan: అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని ఎవరు?
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(69) సంకేతాలిచ్చారు. ఆయన మార్చి 31న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. భారత్–పాక్ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్ అంశమేనని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్ వ్యతిరేకంగా మారిందన్నారు.
Celebrity Brand Valuation: భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచిన వ్యక్తి?
అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని
342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మెజారిటీని కొల్పొయారు. అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డుకెక్కారు. మరోవైపు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) సెషన్ ఏప్రిల్ 3కి వాయిదా పడింది.
Comptroller and Auditor General of India: కల్యాణ్ జువెల్లర్స్ చైర్మన్‌గా నియమితులైన మాజీ కాగ్?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్