Skip to main content

Inspiring Story of Bhaskar Halami : కడు పేదరికం నుంచి ‘అగ్ర’ శాస్త్రవేత్త దాకా... గడ్చిరోలి గిరిజన యువకుని స్ఫూర్తిదాయక గాథ

నాగ్‌పూర్‌: కటిక పేదరికంలోనూ అకుంఠిత దీక్షతో చదువుపై దృష్టిపెట్టి శాస్త్రవేత్తగా ఎదిగాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజన వ్యక్తి. కష్టపడే తత్వంతో ఎలాంటి సమస్యలనైనా దీటుగా ఎదుర్కోవచ్చని చాటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అతని పేరు భాస్కర్‌ హలామీ (44).
Inspiring story of a tribal youth, Scientist Bhaskar Halami
Inspiring story of a tribal youth, Scientist Bhaskar Halami

ఆయన కుటుంబం కుర్ఖేదా తహసీల్‌ పరిధిలోని ఛిర్చాది గ్రామంలో ఉండేది. అక్కడి నుంచి అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రఖ్యాత బయోఫార్మా సంస్థ సిర్నావోమిక్స్‌లో సీనియర్‌ సైంటిస్ట్‌ (రీసెర్చ్, డెవలప్‌మెంట్‌) స్థాయికి ఎదిగారు బాస్కర్‌. ఆ క్రమంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘‘మాది నిరుపేద కుటుంబం. ఒక్కపూట భోజనం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు తలచుకుంటే ఆ కష్టాలన్నీ ఎలా గట్టెక్కామా అని ఆశ్చర్యం వేస్తుంది. చేయటానికి పని ఉండేది కాదు. వర్షాకాలంలో మరీ దారుణం. తింటానికే ఉండేది కాదు. అస్సలు అరగని మహువా పూలను తెచ్చుకుని వండుకుని వాటినే తినేవాళ్లం. కొద్దిగా దొరికే ముడి బియ్యంతో గంజి కాచుకుని తాగేవాళ్లం. మా కుగ్రామంలో 90 శాతం కుటుంబాలది ఇదే దీనావస్థ. 

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: UK మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి ఎవరు?

మా తల్లిదండ్రులు ఇతరుల ఇళ్లలో పనిచేసేవారు. నాన్నకు ఊరికి 100 కి.మీ. దూరంలో స్కూల్లో వంటమనిషిగా పని దొరికాక అక్కడికి వెళ్లిపోయాం. యవత్మాల్‌లోని విద్యానికేతన్‌ ప్రభుత్వ పాఠశాలలో పది దాకా చదివా. అమ్మానాన్నలకు చదువు విలువ బాగా తెలుసు. వాళ్లు పస్తులుండి మాకు అన్నం పెట్టారు. ఉన్నదంతా మా చదువుకే ఖర్చు పెట్టేవారు. 

Also read: Quiz of The Day (November 12, 2022) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?

గడ్చిరోలీలో సైన్స్‌లో డిగ్రీ చేశాక నాగ్‌పూర్‌లో కెమిస్త్రీలో పీజీ చేశా. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యా. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలోనూ పాసయ్యా. కానీ నాకు పరిశోధనపై ఆసక్తి. అందుకే అమెరికా వెళ్లి మిషిగన్‌ వర్సిటీలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలో పీహెచ్‌డీ చేశా. ఇప్పటికీ ఈ రంగంలో నియామక కంపెనీలు నా సలహాల కోసం కుప్పల కొద్దీ మెయిల్స్‌ పంపుతుంటాయి. మా సొంతూళ్లో అమ్మా,నాన్నలకు ఇల్లు కట్టిచ్చా’’ అని భాస్కర్‌ చెప్పుకొచ్చారు. భాస్కర్‌ స్ఫూర్తిదాయక గాథ అందరికీ తెలిసేలా రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ‘టీ విత్‌ ట్రైబల్‌ సెలబ్రిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది!

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 14 Nov 2022 03:43PM

Photo Stories