Skip to main content

Ram Mandir Pran Pratishtha: అమెరికాలో… శ్రీ‌రామ మందిర ‘ప్రాణప్రతిష్ఠ’ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట‌ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
International Telecast of Ayodhya Event  Ram Mandir opening   Live Telecast on January 22   Global Audience for Prana Pratishta

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆరోజు రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. 

బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుంచి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.

అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు.

Republic Day 2024: గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం

Published date : 08 Jan 2024 01:19PM

Photo Stories