Skip to main content

Maternal Deaths: ప్రసూతి మరణాల్లో భారత్‌ టాప్‌

India tops in maternal mortality

ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాలు, పిండస్థ మరణాలు అధిక శాతం ఉన్న టాప్‌10 దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ‘అంతర్జాతీయ ప్రసూతి నవజాత శిశు ఆరోగ్య సదస్సు’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2020–2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు(2.9లక్షలు), పిండస్థ మరణాలు(19 లక్షలు), నవజాత శిశు మరణాలు (23 లక్షలు) కలిపి మొత్తం 45 లక్షల మరణాలు సంభవించాయని ఈ నివేదిక వెల్లడించింది. 2020లో ప్రసూతికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నమోదైన 45 లక్షల మరణాల్లో ఒక్క భారత్‌లోనే 7.78 లక్షల మరణాలు సంభవించాయి. పిండస్థ మరణాలు 17% ఉన్నాయి.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 07:12PM

Photo Stories