ఇక ఎక్కడి నుంచైనా EPFO Life Certificate
ఇకపై ఎక్కడి నుంచైనా సరే ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సాయంతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికెట్‌ను పంపేందుకు అనుమతినిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణాయక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 73 లక్షల మంది పెన్షనర్లలో ఇల్లు విడిచి బయటకు రాలేని వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల కోసం కొత్తగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. దీంతోపాటు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్కీమ్ ప్రయోజనాలను పెన్షనర్, కుటుంబ సభ్యులు ఈ కాలిక్యులేటర్ ద్వారా తెల్సుకోవచ్చు. మరోవైపు, ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ను ఎంపిక చేస్తూ పీఎఫ్ నిర్ణాయక మండలి సీబీటీ నిర్ణయం తీసుకుంది.
also read: ISRO: అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతున్న ‘ఆజాదీ శాట్’