Skip to main content

Skytrax: దక్షిణాసియాలో ఢిల్లీ విమానాశ్రయమే ఉత్తమం

Delhi airport adjudged best airport in South Asia: Skytrax

దేశంలోనే కాకుండా మొత్తం దక్షిణాసియాలోనే ఉత్తమ విమానాశ్రయంగా ఢిల్లీ విమానాశ్రయం నిలిచింది. అంతర్జాతీయ విమాన ప్రయాణ రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌.. ప్రపంచ వ్యాప్తంగా 50 విమానాశ్రయాలకు 2020 నుంచి ఏటా ర్యాంకులు కేటాయిస్తోంది. అంతర్జాతీయంగా 2022లో 37వ స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం.. ఈ ఏడాది ఒక ర్యాంకు మెరుగుపర్చుకుని 36వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఇదే. విమాన ప్రయాణం తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా స్కైట్రాక్స్‌ సంస్థ ఏటా సర్వే నిర్వహిస్తోంది. తాజా సర్వే 2022 ఆగస్టు 2023 ఫిబ్రవరి మధ్య నిర్వహించి, వివరాలు వెల్లడించింది. ఈ జాబితా తొలిస్థానంలో సింగపూర్‌ లోని ఛాంగి విమానాశ్రయం నిలిచింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:30PM

Photo Stories