Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమే..
Sakshi Education
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌కు చెందిన ప్రాంతమేనని అమెరికా స్పష్టం చేసింది.
వాస్తవాదీన రేఖ(ఎల్‌ఏసీ) ఆవలి వైపు చైనా చేసే ఏకపక్ష చొరబాట్లను అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటన నేపథ్యంలో చైనా ఆర్మీ ఈ ప్రాంతంపై తన హక్కును చెప్పుకోవడంపై అమెరికా స్పందించింది. చైనా ఈ ప్రాంతాన్ని ‘జాంగ్నాన్’గా పిలవడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్ భారత్‌లో విడదీయరాని భాగమని భారత్ స్పష్టం చేసింది.
వివరాలు:
- అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ ఉప అధికారప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారత్‌కు చెందిన ప్రాంతమేనని స్పష్టం చేశారు.
- చైనా సైన్యం, పౌరులు ఎల్‌ఏసీ ఆవలి వైపు నుండి ఏకపక్షంగా చొరబాట్లకు పాల్పడే ప్రయత్నాలను అమెరికా వ్యతిరేకిస్తోంది.
- ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరోసారి ఈ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా స్పందించింది.
- భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లోని ‘జాంగ్నాన్’గా చైనా పేర్కొంటోంది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
- అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్‌లోనే ఉంటుందని, ఇకపైనా విడదీయరాని భాగంగానే కొనసాగుతుందని భారత్ మార్చి 20వ తేదీ పునరుద్ఘాటించింది.
Red Sea: ‘హౌతీ’ల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా!!
చైనా స్పందన:
- అరుణాచల్ భారత్‌దేనంటూ అమెరికా చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.
- భారత్–చైనా సరిహద్దు వివాదంలో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని చైనా తెలిపింది.
- అమెరికా ఇతర దేశాల మధ్య వివాదాలను రెచ్చగొడుతూ, వాటిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు.
Published date : 22 Mar 2024 03:23PM