LGBTQ: ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును జారీ చేసిన దేశం?
అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు.
16వ తూర్పు ఆసియా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం?
బ్రూనై ఆతిథ్య దేశంగా అక్టోబర్ 27న నిర్వహించిన 16వ తూర్పు ఆసియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇండోఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని సదస్సుల్లో మోదీ పేర్కొన్నారు.
బ్రూనై...
రాజధాని: బందర్ సెరీ బేగవన్; కరెన్సీ: బ్రునై డాలర్
ప్రస్తుత సుల్తాన్, యాంగ్ డి–పెర్టువాన్, ప్రధాని: హసనల్ బోల్కియా
చదవండి: ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదు: కోర్టు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును జారీ చేసిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అమెరికా
ఎందుకు : అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో భాగంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్