Russia-Ukraine War: యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలయ్యాక ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి సరిహద్దులు దాటినట్టుగా యూనిసెఫ్(UNICEF) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘‘ఈ స్థాయిలో చిన్నారులు దేశం విడిచి పెట్టడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం’’ అని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా దేశం విడిచిపెట్టి వెళితే వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (United Nations Children's Fund–యునిసెఫ్) ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరం ఉంది.
Russia-Ukraine war: నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
రష్యాలో వ్యాపారాలు నిలిపివేసిన సంస్థలు?
రష్యాలో తాత్కాలికంగా తమ వ్యాపారాలు నిలిపివేస్తున్నట్లు కోకో కోలా, పెప్సీకో, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, జనరల్ ఎలక్ట్రిక్ తదితర అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు నిరసనగా ఈచర్యకు దిగామని చెప్పాయి. యూనిలీవర్, అమెజాన్ తదితర సంస్థలు సైతం రష్యాలో వ్యాపారాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.
Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత జట్టు మాజీ సభ్యుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి ఉక్రెయిన్ సరిహద్దులు దాటారు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి(యూనిసెఫ్)
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్