India and Pakistan: అణుకేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్–పాక్
Sakshi Education
గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని అనుసరించి మన దేశం, పాకిస్థాన్ తమతమ అణుకేంద్రాల జాబితాలను జనవరి 1, 2024న పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు కేంద్రాలు, దానికి సంబంధించిన సదుపాయాలపై దాడిని నిషేధించేందుకు 1988లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల ప్రకారం– ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని దౌత్యవర్గాల ద్వారా ఈ పని పూర్తి చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఏటా జనవరి ఒకటో తేదీన ఇరు దేశాలూ ఈ జాబితాలను మార్చుకోవాలని నిబంధనల్లో ఉంది, 1991, జనవరి 27 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
చదవండి: Lakshadweep History: లక్షద్వీప్‌పై పాకిస్తాన్ కన్ను.. లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైందంటే..
Published date : 09 Jan 2024 09:15AM