Retail Inflation : అక్టోబర్‌లో 8.39 శాతంగా నమోదు
ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది. ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గత నవంబర్ 12 న వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్‌బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.
Also read: Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
రిటైల్ ధరలు ఇలా...
- సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం.
- ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది.
- ఆహార ద్రవ్యోల్బణం సెపె్టంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది.
- కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచి్చంది.
- ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది.
- డిసెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనాగా ఉంది.
టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం
- ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది.
- కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది.
- వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి.
- నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది.
- ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP