Twitter office: ఢిల్లీ, ముంబయిలో ట్విట్టర్ కార్యాలయాల మూసివేత
కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగా భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెంటింటిని మూసివేసింది. ఢిల్లీ, ముంబైలో కార్యాలయాలను మూసివేస్తున్నట్టుగా ప్రకటించిన ట్విటర్ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలిచ్చింది. బెంగళూరులో కార్యాలయాన్ని మాత్రం కొనసాగిస్తుంది. 2023 చివరి నాటికి ట్విటర్‌ను ఆర్థికంగా గాడిలో పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న మస్క్ ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యాలయాలను మూసివేస్తున్నారు. గత ఏడాది చివర్లో భారత్‌లో ఉన్న ఉద్యోగుల్లో 90% మందిని ట్విటర్ తొలగించారు.
Job Layoffs 2023 : 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి.. కారణం ఇదేనా..?
భారత్‌లో 450 మందికి గూగుల్ ఉద్వాసన !
టెక్ దిగ్గజం గూగుల్‌లో కూడా లే ఆఫ్‌ల పర్వం మొదలైంది. భారత్‌లో ఒకేసారి 450 మందిని ఇంటికి పంపించింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా ఫిబ్రవరి 16 రాత్రి ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గత నెలలో 12 వేల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులతో సంస్థ నష్టాలు చవిచూడాల్సి వస్తూ ఉండడంతో 12 వేల మందిని తొలగించడానికి నిర్ణయించుకున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ 10 వేలు, అమెజాన్ 18 వేలు, ఫేస్‌బుక్‌కు చెందిన మెటా 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.