Skip to main content

Supreme Court: పార్లమెంటును నిర్దేశించలేం.. సుప్రీంకోర్టు

ఫలానా చట్టం చేయాలంటూ పార్లమెంటుకు నిర్దేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు జ‌న‌వ‌రి 13న‌ స్పష్టం చేసింది.

చట్టాలు చేయడం పూర్తిగా శాసన వ్యవస్థ పరిధిలోని అంశమేనని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్‌ను చట్టబద్ధమైన సంస్థగా ప్రకటించడంతో పాటు తక్షణం చైర్మన్, సభ్యులను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. 22వ లా కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు అటార్నీ జనరల్‌ నివేదించారని గుర్తు చేసింది.

Supreme Court: మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు.. సుప్రీం

Published date : 14 Jan 2023 05:29PM

Photo Stories