Minister Piyush Goyal: ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్న సంస్థ?
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ తలనీలాల ఎగుమతి సంస్థ ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీకి ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. ఏప్రిల్ 16న ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఇండస్ట్రీ అధినేత, ఎంఎస్‌ఎంఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ అవార్డు అందుకున్నారు. తలనీలాల ఎగుమతుల ద్వారా ఉపాధి కలగడమే కాకుండా విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేకూరుతుంది. గత 32 ఏళ్లుగా ఈ పరిశ్రమ ద్వారా తణుకు, ఆచంట, నిడదవోలు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని వేలాది మంది మహిళలకు ఉపాధి కలుగుతోంది.
National Panchayati Raj Day: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
భారతీయ అమెరికన్‌కు కీలక హోదా
భారతీయ మూలాలున్న మరో అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్‌దేవ కొర్హొనెన్‌ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్‌టన్. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్ తల్వార్‌ను మొరాకో రాయబారిగా, షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్ ప్రతినిధిగా అధ్యక్షుడు నియమించారని వైట్‌హౌస్ గుర్తు చేసింది.
Skoch Awards 2022: స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డుకి ఎంపికైన కార్యక్రమం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీ
ఎక్కడ : తాజ్ ప్రెసిడెంట్ హోటల్, ముంబై
ఎందుకు : సంస్థ ఎగుమతుల ద్వారా ఉపాధి కలగడమే కాకుండా విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేకూరుతున్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్