Skip to main content

Odissa Academy: ఒడిశా పాయికా అకాడమీకి ముఖ్య‌మంత్రి ఆమోదం

ఒడిశా పాయికా అకాడ‌మీ కీల‌క పాత్ర పోషించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ కేంద్రం ఖుర్దా జిల్లాలో నిర్మాణం కానుంది. ఇందులో సంస్కృతి సామూహిక శిక్ష‌ణ‌తో పాటు, ప‌రిశోధ‌న‌ల‌కు శిక్ష‌ణ‌ను కూడా చేప‌డ‌తారు.
Odissa CM Naveen Patnaik provides approval for academy
Odissa CM Naveen Patnaik provides approval for academy

సాక్షి ఎడ్యుకేష‌న్: ఖుర్దా జిల్లాలో ఒడిశా పాయికా అకాడమీ, పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం, సంస్క్కృతి శాఖ ఆధ్వర్యంలో గురు కేలూ చరణ్‌ మహాపాత్ర ఒడిస్సీ పరిశోధనా కేంద్రం తరహాలో ఈ కేంద్రం స్థాపిస్తారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పాయికా పరంపర సామూహిక వికాసానికి ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. పాయికా సంస్కృతి సామూహిక అభివృద్ధితోపాటు శిక్షణ, పరిశోధనలకు ప్రత్యేక పాఠ్యాంశాలుగా విద్య, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రం గొడొ ఖుర్దాలో తాత్కాలికంగా పని చేస్తోంది. పూర్తి స్థాయిలో ఈ కేంద్రం ఏర్పాటు కోసం వీలైనంత త్వరగా స్థలాన్ని గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) దాఖలు చేయాలని ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు.

Lecturer Posts: ఈనెల 22లోగా గెస్ట్ లెక్చ‌ర‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తులు


చారిత్రాత్మకం పాయికా విప్లవం

1817 సంవత్సరంలో ఖుర్దా నేలలో బక్షి జగబంధు విద్యాధర మహాపాత్రో నాయకత్వంలో పాయికా ఉద్యమానికి బీజం పడింది. ఆంగ్లేయుల తరిమివేతకు పాయికా విప్లవకారులు తొలుత ఉద్యమించారు. ఇది పాయికా విప్లవంగా చరిత్రలో నిలిచి పోయింది. సిపాయిల తిరుగుబాటు కంటే ఎంతో ముందుగా ఈ విప్లవం జరిగినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నందున ఇదే తొలి భారత స్వాతంత్ర సమరంగా గుర్తించాలని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆంగ్లేయుల తరిమివేతకు పాయికాలు సమైక్యంగా నడుం బిగించి జాతీయ స్థాయిలో తొలిసారిగా ఉద్యమించారు.

IAS Success Story : నా చిన్న‌ప్పుడే నాన్న మ‌ర‌ణం.. అమ్మ కళ్లలో ఆనందం కోసమే ఐఏఎస్ సాధించానిలా..

పాయికా పరంపర విలువల పరిరక్షణతో వీరి ఉద్యమం పూర్వాపరాల పరిశోధన మరిన్ని చారిత్రాత్మక ఆధారాలు వెలుగులోకి తెచ్చేందుకు ఒడిశా పాయికా అకాడమీ, పరిశోధన కేంద్రం మార్గం సుగమం చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పాయికా సంప్రదాయం ఒడిశా చరిత్రలో ఉజ్వలమైన అధ్యాయంగా అభివర్ణిస్తూ, దాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Published date : 09 Sep 2023 03:12PM

Photo Stories