Skip to main content

Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ గమనంలో మార్పు

కురబలకోట: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) గురించి చర్చ జరుగుతోందని.. ఇది మానవ మేధకు మరో రూపమని టీసీఎస్‌ హైదరాబాద్‌ రీజియన్‌ హెడ్‌ రిచర్డ్‌ కింగ్‌ అన్నారు.
Insights on AI from Richard King, TCS Hyderabad Region Head    TCS Hyderabad Region Head Richard King Speak About Artificial Intelligence

మార్చి 27వ తేదీ అంగళ్లులోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై టెక్నికల్‌ సింపోజియం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ యంత్రాలచేత ప్రదర్శింపబడే మేధస్సునే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అన్నారు. అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకు వస్తోందన్నారు. అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. మనిషి జీవితంలో విడదీయరాని బంధంగా మారిందన్నారు. విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుండి వ్యవసాయం, మిలటరీ రంగం వరకు ఇలా దీని ప్రమేయం లేని రంగం లేదనే చెప్పవచ్చన్నారు. నిప్పు, విద్యుత్‌ ఎలా ప్రపంచ గతిని మార్చాయో ఇప్పుడు ఇది కూడా విప్లవాత్మక మార్పులకు కారణం కాగలదన్నారు.

ఉద్యోగాలు పోయే అవకాశం..
ప్రపంచ గమనాన్ని మారుస్తున్న దీనిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. వివిధ ఉద్యోగులు కూడా దీన్ని నేర్చుకుని అప్‌గ్రేడ్‌ కావాలన్నారు. లేదంటే ఉద్యోగాలు పోయే అవకాశం లేకపోలేదన్నారు. ప్రపంచంలో టాప్‌ టెక్నాలజీ కంపెనీలలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై భారీగా పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నాయన్నారు. అమెజాన్‌, అలెక్సా వంటి సంస్థలలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇప్పటికే వచ్చేశాయన్నారు. ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు సరికొత్త పరిశోధనలు చేయాలని కోరారు. ఈ రంగంలో ఉపాధి, ఉద్యోగావకాశాలకు కొదువ లేదన్నారు.

Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై పట్టు సాధించాలి

Published date : 28 Mar 2024 03:45PM

Photo Stories