INSPIRE-MANAK: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2022–23 విద్యాసంవత్సర ఇన్‌స్పైర్ మానక్ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఫిబ్రవరి 12న నిర్వహించారు. గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి 94 ప్రాజెక్టులు ప్రదర్శించారు. డీవైఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహమందిస్తున్నారని అన్నారు.
చదవండి: Inspire Goal: విద్యార్థులు భావి శస్త్రవేత్తలుగా ఎదగడమే ఇన్స్‌పైర్ లక్ష్యం..!
తెనాలి డీవైఈఓ ఎం.నిర్మల మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దవచ్చునని పేర్కొన్నారు. ఈనెల 18న చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు తొమ్మిది ఎగ్జిబిట్‌లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ జస్విన్, డీసీఈబీ కార్యదర్శి లలిత్ ప్రసాద్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, గుంటూరు, బాపట్ల జిల్లాల సైన్స్ అధికారులు అడుసుమల్లి రవికుమార్, మొహమ్మద్ సాదిక్, సైన్స్ కోఆర్డినేటర్లు గౌసుల్ మీరా, పవని భానుచంద్రమూర్తి, సికిందర్ మీర్జాన్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన ప్రాజెక్టులు ఇవే..
గైరుబోయిన యశస్విశివ సాయి, కేజీ హైస్కూల్, కొత్తరెడ్డిపాలెం(చేబ్రోలు), పీసపాటి మస్తాన్‌రావు, సిరిపురం జెడ్పీ హైస్కూల్(మేడికొండూరు), షేక్ సనా బుష్రా(నేతాజీనగర్ మున్సిపల్ హైస్కూల్, పొన్నూరు), వరగాని తోమరాజు(గొట్టిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రత్తిపాడు), కొచ్చర్ల శిరీష, జెడ్పీ హైస్కూల్, ముట్లూరు(వట్టిచెరుకూరు మండలం), సంపతి అమూల్య, జెడ్పీ హైస్కూల్, బల్లికురవ (ప్రకాశం), చిరతనగండ్ల అమూల్య, జెడ్పీ హైస్కూల్, పావులూరు(ఇంకొల్లు), చదువుల సింధూజ, జెడ్పీ హైస్కూల్, జంపని(వేమూరు), ఎల్లల వైష్ణవి శ్రీ ప్రకాశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల(అద్దంకి).
గుంటూరు డీవైఈఓ వెంకటేశ్వరరావు గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి 94 ప్రాజెక్టుల ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికై న తొమ్మిది ప్రాజెక్టులు