SKU: డిగ్రీ పరీక్షలు తేదీలు ఇవే..
Sakshi Education
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిసెంబర్ 18న డిగ్రీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు.
వచ్చే జనవరి 13న పరీక్షలు ముగియనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 18న ఐదో సెమిస్టర్, మంగళవారం ఉదయం మొదటి సెమిస్టర్, మధ్యాహ్నం మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామన్నారు.
చదవండి: Fake Online Degrees: ఈ ఆన్‌లైన్ డిగ్రీలతో జాగ్రత్త - UGC
పరీక్షల్లో అవకతవకలు పాల్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మాస్‌కాపీయింగ్ ప్రోత్సహిస్తే సంబంధిత పరీక్ష కేంద్రాలను రద్దు చేస్తామన్నారు. గతంలో రద్దు చేసిన పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
Published date : 18 Dec 2023 02:21PM