Skip to main content

CISEC Results 2024 : ఐసీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల​.. ఇలా చెక్‌ చేసుకోండి

CISEC Results 2024  10th exam results announcement
CISEC Results 2024

ఐసీఎస్‌ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE)ఫలితాలను వెల్లడించింది. విద్యార్థులు CISCE అధికారిక వెబ్‌సైట్‌ cisce.org లేదా results.cisce.orgలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

కాగా ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు మార్చి 28తో; ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 13తో ముగిశాయి. విద్యార్థులు తమ యూఐడీ, హాల్‌టికెట్‌ ఇండెక్స్‌ నంబర్‌ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలను చూసుకోవచ్చు. 


ICSE ISC Class 10th, 12th Results.. ఇలా చెక్‌ చేసుకోండి...

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ www.cisce.org ను క్లిక్‌ చేయండి. 
  2. హోంపేజీలో కనిపిస్తున్న రిజల్ట్‌ పేజ్‌ను క్లిక్‌ చేయండి. 
  3. ICSE (Class X) ఫలితాల కోసం కోర్స్‌ ఆప్షన్‌లో ICSEను క్లిక్‌చేయండి
  4. ISC (Class XII) ఫలితాల కోసం కోర్స్‌ ఆప్షన్‌లో ISCను క్లిక్‌చేయండి
  5. ఇప్పుడు యూఐడీ, హాల్‌టికెట్‌ ఇండెక్స్‌ నంబర్‌ వివరాలు ఎంటర్‌ చేయండి
  6. తర్వాతి పేజీలో స్క్రీన్‌పై ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. ప్రింట్‌ అవుట్‌ తీసుకోవచ్చు. 
Published date : 06 May 2024 02:34PM

Photo Stories