1998 డీఎస్సీ ఎమ్టీఎస్‌పై నియామకాలు
24 ఏళ్ల వారి కలలను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. వీరు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని మినిమం టైమ్ స్కేలుపై టీచర్లుగా నియమించేందుకు Department of School Education ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జూన్ 23న మెమో జారీ చేశారు. 1998 DSC ఎలిజిబుల్ అభ్యర్థుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించనున్నారు. వీరిని 2008 డీఎస్సీ అభ్యర్థులకు మాదిరిగానే ఎమ్.టీ.ఎస్ పై టీచర్ పోస్టుల్లో అడహాక్ పద్ధతిలో నియమిస్తారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కేజీబీవీ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్, మోడల్ స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్లు, డీఈవో పరిధిలోని టీచర్ల పూల్‌లో నియమించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 DSC ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేసి న్యాయం చేకూర్చడం పట్ల అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుందని ఎమ్మెల్సీ కల్పాలతారెడ్డి తెలిపారు.
చదవండి: