Open schools: ఓపెన్ స్కూల్‌తో ఎంతో ప్రయోజనం
పిట్టలవానిపాలెం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన దూరవిద్య ద్వారా చదువు మధ్యలో మానేసిన వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఓపెన్ స్కూల్స్ రాష్ట్ర డైరెక్టర్ కె.నాగేశ్వరరావు తెలిపారు. బాపట్ల జిల్లాలో మంగళవారం పర్యటించారు. ఇందులో భాగంగా పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్‌స్కూలు విధానం ద్వారా పరీక్షలు రాసి అనేక రకాలైన ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఈసందర్భంగా ఆయనను కర్లపాలెం శ్రీభార్గవి విద్యాసంస్థల అధినేత పేరాల వెంకట సురేష్ ఘనంగా సత్కరించారు.
Also Read : Free training: ఫోన్ రిపేర్, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌లో ఉచిత శిక్షణ
ఓపెన్‌స్కూలు విధానంలో అత్యధిక అడ్మిషన్‌లు సాధించిన శ్రీభార్గవి స్కూలును ప్రత్యేకంగా అభినందించారు. ఓపెన్‌స్కూలు విధానం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను గ్రామీణస్థాయిలో వివరించి సత్ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట రాష్ట్ర కో–ఆర్డినేటర్‌లు శ్రీనివాసులు, నరసింహులు, చందోలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పొదిలి వీరయ్య, ఓపెన్‌స్కూలు సిబ్బంది ఉన్నారు.