Skip to main content

Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇవే..

ఐటీ దిగ్గజం టీసీఎస్‌ తన ఉద్యోగులకు మరో కీలక సమాచారాన్ని అందించింది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానానికి గుడ్‌ బై చెప్పేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

టీసీఎస్‌ కూడా తన ఉద్యోగులకు తిరిగి ఆఫీసులకు రప్పిస్తోంది. అయితే ప్రత్యేక కారణాల రీత్యా ఇంటినుంచి పని చేయాలనుకునే వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. 

ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే..
ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే.. కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరం తాజాగా వెల్లడించింది. ఆయా ఉద్యోగులు వారి రోగ నిర్ధారణలు, చికిత్సలు, ధృవీకరణ పత్రాలను కంపెనీ-ప్యానెల్ మెడికల్ కమిటీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుందని కోరింది. ఇలా కొంతమంది ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు టీసీఎస్‌ తెలిపింది.  

వారంలో కనీసం మూడు రోజులు.. 
ఇటీవల ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని ఆదేశించిన టీసీఎస్‌. ఇపుడిక ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. కంపెనీ సూపర్‌వైజర్లు రూపొందించిన రోస్టర్ ప్రకారం, కార్పొరేషన్ తన సిబ్బందిని సెప్టెంబర్ 22న తమ కార్యాలయాలకు రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఇప్పటికే ఆఫీసులకు వస్తున్నారని  టీసీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

6,16,171 మంది ఉద్యోగులలో..
టీసీఎస్‌లోని 6,16,171 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు మంది కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభించారని సోమవారం కంపెనీ త్రైమాసిక ఆదాయ ప్రకటన సందర్భంగా  చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. డిసెంబరు నుంచి రోస్టర్‌ ఆధారిత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆయన  పేర్కొన్నారు.

Published date : 12 Oct 2022 05:27PM

Photo Stories