Skip to main content

Notification: ఎట్టకేలకు TRT నోటిఫికేషన్‌ విడుదల కానీ నిరుద్యోగుల్లో నిరాశ..

● ఎట్టకేలకు టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల ● ఖాళీలు ఎక్కువ.. ప్రకటించింది తక్కువ
TRT Notification, feeling disappointed, job opportunities
TRT Notification

మంచిర్యాలఅర్బన్‌: ఎన్నో ఏళ్ల తర్వాత వెలువడిన టీఆర్టీ ప్రకటన నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోంది. జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు, వెల్లడించిన పోస్టులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఓ వైపు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండగా హడావుడి ప్రకటనపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఏ, ఎస్జీటీల పదోన్నతుల తర్వాత జిల్లాలో మరింతగా ఖాళీలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం చూస్తే పదోన్నతుల తర్వాత సుమారు 200 ఎస్జీటీ పోస్టులు ఖాళీ ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పోస్టులన్నీ ఎలా భర్తీ చేస్తారో తెలియకుండా పోతోంది. పదోన్నతుల ప్రక్రియ ముగియగానే ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నెలల తరబడి శిక్షణ

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మెగా టీఆర్టీ ప్రకటిస్తుందని వేలాది మంది నిరుద్యోగులు ఆశతో ఎదురుచూశారు. అందుకు భిన్నంగా పదుల సంఖ్యలోనే సబ్జెక్టుల వారీగా పోస్టులకు నియామకాలు చేపడుతామని వెల్లడించడంపై అసంతృప్తికి గురిచేస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకు డీఎస్సీ నియామకాలు లేకపోవడం.. ఏళ్ల తరబడి నిరుద్యోగులను నిరుత్సాహానికి గురిచేసింది. పదేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉద్యోగ వయస్సుకు దగ్గరకు వచ్చిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజా గా వెలువరించిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశిత వయస్సు దాటిపోవడంతో సడలింపు ఇచ్చిన వందలాది మందికి అవకాశాలు లే కుండా పోతోంది. జిల్లాలో సోషల్‌, బయోసైన్స్‌ పో స్టులు కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పదిలో పే పోస్టులు ఖాళీగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదు రు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆశనిపాతంలా మారింది. ఇంటికి దూరంగా ఉండి కోచింగ్‌ తీ సుకుంటూ నెలలు తరబడి చదువుతున్న వారిలో ని రుత్సాహాన్ని నింపింది. జిల్లాలో ఖాళీల కంటే పో స్టులు తక్కువ చూపడంతో డీఎస్సీ ప్రకటన వచ్చిందనే సంతోషం లేకుండా పోతోందని వాపోతున్నారు. పదోన్నతులు, బదిలీల తర్వాత జీవోను సవరించి ఉపాధ్యాయ ఖాళీలను వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Published date : 11 Sep 2023 10:20AM

Photo Stories