Anganwadi Latest News: అంగన్‌వాడీలకు ఒంటిపూట బడులు... ఎప్పటినుంచి అంటే
కెరమెరి(ఆసిఫాబాద్): ఇప్పటికే పాఠశాలల్లో ఈ నె ల 15 నుంచి ఒంటిపూట తరగతులు కొనసాగుతుండగా.. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలు సైతం మధ్యాహ్నం వరకే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రానున్న రెండు నెలల పా టు వేసవి వేడి అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించా లని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు అందాయి.
973 సెంటర్లు
జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొ త్తం 40 సెక్టర్లు ఉన్నాయి. ఇందులో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆరేళ్లలోపు చిన్నారులు 49,029 మంది ఉండగా.. బాలింతలు 4,518 మంది, గర్భిణులు 4566, కిశోర బాలికలు 22,820 మంది ఉన్నారు.
వేసవి ప్రారంభం కావడంతో జి ల్లాలో మార్చిలోనే 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువగా పగ టి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఆ కాశం మబ్బులు పట్టి వాతావరణం కొంత మేర కు చల్లబడినా.. మరో వారం తర్వాత ఎండలు మ రింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు.
వేసవిలో వడగాల్పులతో చిన్నారులు అవస్థలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఒంటిపూట అంగన్‌వాడీ కేంద్రాలు తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కేంద్రాలు ఉదయం 8 గంటలకే తెరుచుకో నున్నాయి.
ఆయా సెంటర్లలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటల కు చిన్నారులు ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకుంటారు.
వసతులు కరువు..
జిల్లాలో చాలా వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. అద్దె భవనాలు, పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. దీంతో ఇరుకు గదుల్లో విద్యుత్ సౌకర్యం లేక చలికాలంలోనే చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. వేసవిలో ఉక్కపోతతో మరింత అవస్థలు పడే అవకాశం ఉంది.
కొన్ని కేంద్రాలకు అయితే సాగు నీటి సౌకర్యం లేక ఇళ్లనుంచే వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మరో వైపు విద్యుత్ సౌకర్యం లేక కొన్ని నెలల క్రితం ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరు చేసిన టీవీలు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించడం చిన్నారులకు ఉపశమనంగా మారనుంది.
అలాగే ఎండల తీవ్రతకు అనుగుణంగా మే నెలలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు 15 రోజుల చొప్పున సెలవులు ప్రకటించనున్నారు.
Tags
- latest Anganwadi news
- Anganwadi
- Anganwadi Half Day School News
- half day schools
- Anganwadis
- Half Day School for Anganwadis
- Half day Schools 2024 Details in Telugu
- Anganwadi Half Day School lastes news
- Anganwadi Centers
- Anganwadi Schools
- Half Day School News
- Anganwadi Supervisor
- Anganwadi Teachers
- Anganwadi students
- Anganwadi childrens news
- trending school news
- Students Lastest news
- Telangana Half day schools
- Breaking news for telugu states
- Telangana News
- AP News