Skip to main content

Free training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training, Vocational Courses Application, MPDO Mahesh Babu, Kondurgu Training Announcement
Free training

కొందుర్గు: నిరుద్యోగ యువతీయువకుల నుంచి వృత్తివిద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లేడ్‌ చౌదరిగూడ ఎంపీడీఓ మహేష్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. అక్టోబర్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.

ఎంపికై న అభ్యర్థులకు ఎస్‌బీఐ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ ఆధ్వర్యంలో కార్‌ డ్రైవింగ్‌, సీసీ టీవీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల వారు సంబంధిత సర్టిఫికెట్లతో చిలుకూరులోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వద్ద హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 85001 65190, 79819 51167 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Published date : 03 Oct 2023 10:09AM

Photo Stories