NTA GAT-B/BET 2024 Notification- జీఏటీ–బీ)/బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2024 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్–బయోటెక్నాలజీ(జీఏటీ–బీ)/బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్(బీఈటీ) నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలతో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) అందిస్తారు.
అర్హత: బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్/ఇతర బయాలజీ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్స్ (బీఈ/బీటెక్), మాస్టర్స్(ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంవీఎస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంటెక్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: మార్చి 6, 2024
పరీక్ష తేది: 20 ఏప్రిల్, 2024
మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్: https://dbt.nta.ac.in/ ను సంప్రదించండి.