Deworming Day: పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..
Sakshi Education
పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కారణంగా తానే విద్యార్థులకు మాత్రలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ..
సాక్షి ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ పట్ల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా బరంపేటలోని శ్రీరామకృష్ణ ఓరియంటల్ పాఠశాలలో విద్యార్థులకు అసిస్టెంట్ కలెక్టర్ కల్పశ్రీ ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.
Science Fair: రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ విద్యార్థులవే..
ఆమె మాట్లాడుతూ ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఆల్బెండజోల్ టాబ్లెట్ నమిలి మింగి నులిపురుగుల నివారణకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణ రాజరాజేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Published date : 12 Feb 2024 10:01AM