Skip to main content

Gurukul Students Talent: బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్క్‌టెక్చర్‌ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్ర‌తిభ‌..

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల ఐఐటీ–నీట్‌ అకాడమీ విద్యార్థులు బీఆర్క్‌లో ఉత్తమ ఫలితాలు సాధించారు..
Gurukul students achieves high score in Bachelor of Architecture

కల్లూరు: ఎన్‌టీఏ వారు నిర్వహించిన జాతీయ స్థాయి బీఆర్క్‌ (బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్క్‌టెక్చర్‌) పరీక్ష ఫలితాల్లో చిన్నటేకూరు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల ఐఐటీ–నీట్‌ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. అకాడమీకి చెందిన విద్యార్థులు ఆల్‌ ఇండియా క్యాటగిరీలో మంచి ర్యాంకులు సాధించారు. జి.సూర్యతేజ –51, ఎ.భాను సుజ్ఞాన్‌ – 123, కె.లక్ష్మీనరసింహ – 412 ర్యాంక్‌ సాధించినట్లు అకాడమీ డైరెక్టర్‌ డి.రామసుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. ఈ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన వారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, అందుకు సహకరించిన అధ్యాపక బృందాన్ని అకాడమీ డైరెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

AP DEECET 2024: ఈనెల 24న డీఈఈ సెట్ ప‌రీక్ష‌.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా!

Published date : 23 May 2024 12:24PM

Photo Stories