Skip to main content

Free Training: ఈ రంగాల్లో పురుషులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు వివరాలు..!

స్వయం ఉపాధి శిక్షణాసంస్థ ఆధ్వర్వంలో అందిస్తున్న ఈ శిక్షణకు నిరుద్యోగ యువకులకులు అర్హులని తెలపారు అక్కడి డైరెక్టర్‌. అయితే, దరఖాస్తులు చేసుకునేందుకు వివరాలను, అర్హుల గురించి కూడా వివరించారు..
Free Training for Men in two courses in April

తిమ్మాపూర్‌: ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణాసంస్థ ఆధ్వర్వంలో ఏప్రిల్‌ 15 నుంచి ఫొటోగ్రఫీ అండ్‌ వీడియోగ్రఫీలో పురుషులు, ఏప్రిల్‌ 18 నుంచి సీసీటీవీ ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ సర్వీసింగ్‌పై పురుషులకు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్‌ డి.సంపత్‌ తెలిపారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Freshers Day: న్యాయ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని, టూల్‌కిట్‌, యూనిఫాం, శిక్షణ ధ్రవీకరణ పత్రం అందిస్తామన్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, టెన్త్‌ మెమో జిరాక్స్‌తోపాటు 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు మహాత్మానగర్‌లోని ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో లేదా 9949448157లో సంప్రదించాలన్నారు.

Job opportunities: న్యాయ సేవా సంస్థ డిఫెన్స్‌ కౌన్సిల్‌లో ఉద్యోగావకాశాలు

Published date : 23 Mar 2024 05:31PM

Photo Stories