Skip to main content

Free Training In Computer Courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్న హార్వర్డ్‌ యూనివర్సిటీ

Free Training In Computer Courses

ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటైన  హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం (Harvard University) విద్యార్థులకు, నిరుద్యోగులకు సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను అందజేస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌ బేసిక్‌ అంశాల దగ్గర నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వరకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందించనుంది. కోర్సుల వివరాల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 


కంప్యూటర్‌ సైన్స్‌ ఫండమెంటల్స్‌

కంప్యూటర్‌ సైన్స్‌ బేసిక్‌ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ కోర్సులో కవర్‌ చేస్తారు. అల్గారిథమిక్ థింకింగ్ నుండి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వరకు, విద్యార్థులకు బేసిక్‌ C, పైథాన్ మరియు SQL వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై శిక్షణ అందిస్తారు. 


డేటా సైన్స్‌

డేటా సైన్స్‌ రంగానికి ఈ మధ్యకాలంలో డిమాండ్‌ బాగా పెరుగుతోంది. డేటా సైన్స్ ఫండమెంటల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, డేటా విజువలైజేషన్, డేటా మానిపులేషన్, డేటా అనాలిసిస్ వంటివి ఇందులో నేర్పిస్తారు. వీటితో పాటు మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, బిగ్ డేటా వంటివి కూడా నేర్పిస్తారు. ఈ కోర్సులకు డిమాండ్‌ బాగా ఉండటంతో కంపెనీలు భారీ జీతంతో ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి. 


బిల్డింగ్‌ డైనమిక్‌ వెబ్‌సైట్స్‌

ఏదైనా కంపెనీకి తమను తాము మార్కెటింగ్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌ అన్నది చాలా ముఖ్యం. ఒక వెబ్‌సైట్‌ ఎలా ఉండాలి? ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ ఎండ్‌​ డిజైన్‌ వరకు ఈ కోర్సులో పూర్తి అవగాహన కల్పిస్తారు. పైథాన్, జావాస్క్రిప్ట్‌తో సింపుల్‌గా వెబ్‌సైట్స్‌ను ఎలా క్రియేట్‌ చేయాలో ఈ కోర్సులో వివరిస్తారు. 


గేమ్‌ డెవలప్‌మెంట్‌ 
హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇంట్రడక్షన్ టు గేమ్ డెవలప్‌మెంట్ అనే ఉచిత కోర్సును అందిస్తోంది. గేమ్ డెవలప్‌మెంట్ బేసిక్‌ అంశాలు ఈ కోర్సులో వివరిస్తారు. ఇది మాత్రమే కాదు సృజనాత్మక వీడియో గేమ్‌లు, వాటిని తయారు చేయడంలో ఉపయోగించే పద్ధతుల గురించి ఈ కోర్సులో వివరిస్తారు. 

మెషిన్‌ లెర్నింగ్‌
మెషిన్ లెర్నింగ్ బేసిక్స్‌, అల్గారిథమ్స్‌,స్టాటిస్టికల్ మోడల్‌, వివిధ డొమైన్‌లలో AI యొక్క అప్లికేషన్స్‌ వంటివి ఈ కోర్సులో నేర్పిస్తారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఉంది. వీరికి ముఖ్యంగా ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, డేటా సైన్స్‌పై మంచి అవగాహన ఉండాలి. 

సైబర్‌ సెక్యూరిటీ

సైబర్‌ సెక్యూరిటీ అనేది డిజిటల్ దాడుల నుండి సంస్థలు, వ్యక్తులు లేదా నెట్‌వర్క్‌లను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈరోజుల్లో సైబర్ భద్రతను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ కోడింగ్‌, ఎథికల్‌ హైకింగ్‌ వంటి అంశాలపై ఈ కోర్సులో వివరిస్తారు. 

మొబైల్ యాప్ డెవలప్‌మెంట్:
మొబైల్ అప్లికేషన్‌లను రూపొందించాలనుకునేవారికి ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంది.  జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అయిన రియాక్ట్ నేటివ్‌ను ఉపయోగించి క్రాస్-ప్లాట్‌ఫారమ్ మొబైల్ యాప్‌లను అభివృద్ధి చేయొచ్చు. 

Published date : 11 Mar 2024 05:07PM

Photo Stories