DOST 2024 Admissions: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కొనసాగుతున్న దోస్త్ దరఖాస్తులు.. ఆ కోర్సులకు డిమాండ్
నిర్మల్‌ఖిల్లా: ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ) ప్రక్రియ కొనసాగుతోంది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గానూ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీబీఎం, తది తర కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలలన్నీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పుగా నమోదు చేసినట్లు నిర్ధారించుకుంటే హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలని కోరుతున్నారు.
సంప్రదాయ కోర్సులకు డిమాండ్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, దాదాపు 30 వరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులోని అన్ని రకాల కోర్సుల్లో కలిపి దాదాపు 18 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. డిగ్రీలో సంప్రదాయ కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తరకం ఉపాధి కోర్సులను కూడా ప్రారంభిస్తోంది.
ప్రవేశాలు మూడు దశల్లో...
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మూడు విడతల్లో జరగనున్నాయి. మే 6 నుంచి మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుండి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 7 నుండి 12 వరకు కేటాయించబడిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల ప్రకారం రెండవ దశ, మూడవ దశ లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
రెండో దశ..
రూ.400 రుసుంతో జూన్ 6 నుంచి 13 వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. జూన్ 6 నుంచి 14 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఉంటాయి. జూన్ 18న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్ 19 నుంచి 24 వరకు సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు.
మూడో దశ..
జూన్ 19 నుంచి 25 వరకు ‘దోస్త్’ మూడో దశ రిజిస్ట్రేషన్ ఉండనుంది. రూ.400 రుసుంతో మూడో విడత రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 19 నుంచి 25 వరకు మూడో దశ వెబ్ ఆప్షన్లు ఉంటాయి. జూన్ 29న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయి.
మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు..
మొబైల్ యాప్ ద్వారా కూడా దోస్త్ దరఖాస్తు చేసుకోవచ్చని హెల్ప్ డెస్క్ అధికారులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్లలోని ప్లే స్టోర్ నుంచి డిగ్రీ దోస్త్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో సూచించిన ప్రకారం మొబైల్ నంబర్ ఓటీపీతో వెబ్‌సైట్లోకి ప్రవేశించి సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వెబ్ ఆప్షన్ల తర్వాత ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో కూడా తెలుసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్స్ నమోదు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సమీపంగా ఉన్న వాటిని ముందుగా ఎంచుకుని ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో దూరంగా ఉన్న వాటిని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కోర్సులు కూడా తమకు నచ్చిన వాటిని తొలుత, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారు.
Tags
- DOST Admissions
- DOST News
- DOST 2024 Notification Details and Important dates
- Degree course admissions
- DOST-2024 admissions
- online admissions
- Degree online admissions
- DOST
- ts dost 2024
- ts dost 2024 full details in telugu
- dost 2024 live updates
- Online Degree Admissions
- ts dost 2024 important dates
- ts dost 2024 important dates news in telugu
- DOST Colleges