Skip to main content

Sports Competitions: అథ్లెటిక్స్‌లో ఉపాధ్యాయుల ఉత్సాహం

విద్యార్థులతో పాటు అథ్లెటిక్స్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులు పోటీల్లో స‌త్తా చాటి, వారి ప్ర‌తిభ‌ను చూపారు. ఈ పోటీల్లో గెలిచిన వారిని రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ఎంపిక చేస్తామ‌ని తెలిపారు.
Students and Teachers at Athletic Competitions,Athletics competitions winner David receiving prize,Winners Heading to State-Level Competitions
Athletics competitions winner David receiving prize

సాక్షి ఎడ్యుకేష‌న్: అథ్లెటిక్స్‌లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు. విశాఖలోని పోలీసు బ్యారెక్స్‌లో మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన పోటీల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపుతున్నారు. కోటవురట్లకు చెందిన ఉపాధ్యాయుడు పి.డేవిడ్‌ పలు విభాగాలలో సత్తా చాటారు.

Employment Offer: త‌పాలా జీవిత భీమాలో ఉపాధి అవ‌కాశం

జిల్లా స్థాయిలో జరిగిన ఈ అథ్లెటిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, లాంగ్‌ జంప్‌లో కాంస్య పతకం సాధించారు. డిసెంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు డేవిడ్‌ తెలిపారు. సహచర ఉపాధ్యాయులు డేవిడ్‌కు అభినందనలు తెలిపారు.

Published date : 10 Oct 2023 10:53AM

Photo Stories